సర్పంచ్ బరిలో విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దబ్బగట్ల శ్రీకాంత్

On: December 5, 2025 7:48 PM
సర్పంచ్ బరిలో విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దబ్బగట్ల శ్రీకాంత్

సర్పంచ్ బరిలో విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దబ్బగట్ల శ్రీకాంత్

కన్నాయిగూడెం, డిసెంబర్ 5, తెలంగాణ జ్యోతి :  కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ములుగు జిల్లా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దబ్బగాట్ల శ్రీకాంత్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. జూనియర్ కళాశాల దశ నుంచే అధివాసి విద్యార్థి సంఘంలో చురుకుగా పనిచేస్తూ, లంబాడీలు ఎస్టీలు కాదని డిమాండ్ చేస్తూ ఏటూరునాగారం నుండి వరంగల్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రలు చేసిన ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందారు. తన గ్రామంపై ప్రభావం చూపే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఆయన, ఐటీడీఏ పరిధిలో అధివాసులపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ నిరంతరం ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. 2012 నుండి ఉమ్మడి విద్యార్థి సంఘంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతానికి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జల్–జంగిల్–జమీన్ కోసం నిస్వార్థంగా పోరాడే నాయకుడిగా శ్రీకాంత్ ప్రసిద్ధి చెందారు. ఉన్నత విద్యాభ్యాసంతో జాతికోసం కష్టపడే యువ నాయకుడిని ఒక అవకాశంతో నిలబెట్టితే, కంతనపల్లిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని ఆయన గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment