Seetakka | మిచాంగ్ తుఫాన్ ముంచుకొస్తుంది
– ములుగు జిల్లాలో ప్రజలను అప్రమత్తం చేయాలి
– అధికారులను ఆదేశించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : బంగాళాఖాతం లో ఏర్పడిన తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రం పై పడింది. ఈ ఎఫెక్ట్ తో రాష్ట్రం లో సోమవారం నుండి ములుగు జిల్లా లో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాతా వరణ శాఖ ములుగు జిల్లా కు రెడ్ అలెర్ట్ ప్రకటించారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ క్రమంలో ములుగు జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం అప్రమత్తం అయి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంకా రెడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, గోదావరి తీరా ప్రాంత ప్రజలు దయచేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలన్నారు. అవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని, జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి నష్టాలు జరగకుండా నష్ట నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఆదైర్య పడవద్దు, కల్లాలలో ఉన్న వరి ధాన్యం తో పాటు ఇతర పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ప్రజలంద రినీ ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేయాల న్నారు.
1 thought on “Seetakka | మిచాంగ్ తుఫాన్ ముంచుకొస్తుంది”