జాకారం సర్పంచ్ అభ్యర్థికి సీపీఎం మద్దతు
– మండల బాధ్యులు రత్నం ప్రవీణ్
ములుగు, డిసెంబర్ 9, తెలంగాణ జ్యోతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ములుగు మండలం జాకారం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిట్టల సుజాత మధుసూదన్ కు సీపీఎం పార్టీ మద్ధతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ మండల నాయకుడు రత్నం ప్రవీణ్ తెలిపారు. ఈమేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ప్రవీణ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిట్టల సుజాత మధుసూదన్ కుటుంబానికి సపోర్టుగా నిలుస్తామన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఆ నిర్ణయం తీసుకున్నామని, గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తామన్నారు. సీపీఎం నాయకులు ఈవిషయాన్ని గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో చంటి పవన్ సురేందర్ ప్రశాంత్ రవీందర్ కార్తీక్ భాస్కర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.






