మాజీ మిలిటెంట్ లకు కౌన్సిలింగ్ : ఎస్సై తాజుద్దీన్
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : మావోయిస్టు మాజీ మిలిటెంట్ లకు, గతంలో అరెస్టయిన మావోయిస్టులకు శని వారం ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో మావో యిస్టు వారోత్సవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్య ల్లో భాగంగా వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. మండల పరి ధి గ్రామాలలో వ్యతిరేక శక్తులు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలలో అనుమానాస్ప ద వ్యక్తులు సంచరించినట్లయితే సమాచారం అందించాల న్నారు. కొత్త వ్యక్తులకు గ్రామాలలో ఆశ్రయం కల్పించవద్ద న్నారు. సంఘ విద్రోహ శక్తులకు ఎవరూ కూడా సహకరించ వద్దన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్, సి ఆర్ పి పోలీసులు పాల్గొన్నారు.