నాణ్యత లోపంతో సిసి రోడ్ల నిర్మాణం
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయి గూడెం మండల కేంద్రంలోని బుట్టయిగూడెం, ముప్పనపల్లిలో సీసీ రోడ్డు నాణ్యత లోపంతో వేశారని గ్రామస్తులు ఆరోపిస్తు న్నారు. గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేపడుతున్నామ ని.. ప్రజా ప్రతినిధులు చెప్పుకుంటూనే సీసీ రోడ్ల నిర్మాణానికి కావలసిన మెటీరియల్లో కళ్ళకు కనిపించడానికి మాత్రమే ఇసుక, సిమెంటు, కంకరను పైపైకే వాడుతున్నట్లు హడావిడి చేశారు. కానీ నాణ్యత లోపానికి గురిచేసే వైట్ డస్ట్ వాడుతూ సీసీ రోడ్లు వేశారంటూ ప్రజలు వాపోతున్నారు. ఇలా వేయడం సమంజసం కాదని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇంత వ్యవహారం జరుగుతున్న సంబంధిత మండల అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలకు దారి తావిస్తోందని.. జిల్లా కలెక్టర్ ఈ పనులపై ఆరా తీసి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతు న్నారు.