పలిమెల భూ అక్రమాలపై “కోట” ఫైర్ !

పలిమెల భూ అక్రమాలపై "కోట" ఫైర్ .. !

పలిమెల భూ అక్రమాలపై “కోట” ఫైర్ .. !

– మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ రాహుల్ శర్మకు వినతి 

– తహసిల్దార్ సస్పెన్షన్..?

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి:  జయశంకర్ భూపాల పల్లి జిల్లా పలిమెల మండలంలో జరుగుతున్న భూ అక్రమాలపై మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోట రాజబాబు గౌడ్ ఫైర్ అయ్యారు. మారుమూల ఆటవిక గిరిజన ప్రాంతమైన పలిమెల మండలంలో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసు కుని కొంతమంది బినామీ వ్యక్తులు అధికారులతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. పలిమల మండలం లో 50 ఏళ్లకు పైగా కాస్తు సాగు చేసుకుంటున్నా భూ కమతా లను కొంతమంది భూస్వాములు వారికి తెలియకుండానే అధికా రులతో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపిం చారు. సుమారు 102 ఎకరాల భూములను కొంతమంది దక్కన్ సిమెంట్ కంపెనీకి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని, వీటిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని రాజబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు విన్నవిం చగా, భూములపై పూర్తి వివరాలు నివేదిక సమర్పించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పలిమల భూముల అక్రమాలపై కాటారం సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్ ను కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉండగా పలిమెల తహసిల్దార్ సయ్యద్ సర్వర్ ను సస్పెన్షన్ చేసినట్లు సమాచారం. సీసీఎల్ఏ సమగ్ర దర్యాప్తు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడినట్లు సమాచారం.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment