ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి 

On: February 13, 2026 3:13 PM

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి 

20 వార్డుల్లో 12 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 2 స్వతంత్ర, 1 బీజేపీ గెలుపు

ములుగు ప్రతినిధి, ఫిబ్రవరి13,తెలంగాణజ్యోతి:  ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. ఈ నెల 11న జరిగిన పోలింగ్‌కు శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మూడు రౌండ్లుగా నిర్వహించిన కౌంటింగ్‌లో మొత్తం 20 వార్డుల్లో 12 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 2 స్వతంత్ర, 1 బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. 1వ వార్డు ఆలోతు పద్మ (కాంగ్రెస్), 2వ వార్డు కోయిల లక్ష్మి (బీఆర్ఎస్), 3వ వార్డు యాసం వసంత (కాంగ్రెస్), 4వ వార్డు గుంటోజు పావని (కాంగ్రెస్), 5వ వార్డు గుగ్గిళ్ళ దివ్య (కాంగ్రెస్), 6వ వార్డు చింతనిప్పుల చంద్రకళ (కాంగ్రెస్), 7వ వార్డు బైకాని సునీత (బీఆర్ఎస్), 8వ వార్డు నల్లెల్ల స్వాతి భరత్ (కాంగ్రెస్), 9వ వార్డు గండ్రకోట వాణీ (స్వతంత్ర), 10వ వార్డు గజ్జల సుస్మిత (కాంగ్రెస్), 11వ వార్డు కేశెట్టి నవీన్ (కాంగ్రెస్), 12వ వార్డు పోరిక రాజు నాయక్ (స్వతంత్ర), 13వ వార్డు చిలువేరు సాంబయ్య (కాంగ్రెస్), 14వ వార్డు ఆసియా షాహిద్ (కాంగ్రెస్), 15వ వార్డు రేసోజు పద్మ వేణుగోపాల చారి (బీఆర్ఎస్), 16వ వార్డు ఎండి కుతుబుద్దీన్ (కాంగ్రెస్), 17వ వార్డు గోనెల భరత్ (బీఆర్ఎస్), 18వ వార్డు బైకానికి అనూష సాగర్ (బీఆర్ఎస్), 19వ వార్డు పౌడాల ఓం ప్రకాష్ (కాంగ్రెస్), 20వ వార్డు కొత్త సురేందర్ (బీజేపీ)అభ్యర్థులు గెలుపొందారు. గెలుపొందిన అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులతో కలిసి స్వీట్లు పంచుకొని బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!