రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన
ములుగు, డిసెంబర్21, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సైక్లింగ్ పోటీలలో పాల్గొని జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించారు. ములుగు బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన డోంగ్రి శ్రీనివాస్, తేజావత్ యాకూబ్, గొట్టిముక్కుల తులసి రామ్, పూతల మనోహర్ లు శుక్రవారం నుండి సిద్దిపేటలో జరగ బోయే రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికయ్యారని, ఈ పోటీల లో ప్రతిభను ప్రదర్శించి బహుమతులు గెలుచుకోవాలని తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం క్యాతం రాజేందర్, పిట్టల మల్లయ్య, శిరూప సతీష్ కుమార్, తోట చంద్రమౌళి, గుండే టి మమత, సంగ చేరాలు, శివనాధుని శారద, బై కాని రజిత తదిత రులు పాల్గొన్నారు.
1 thought on “రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన”