మున్సిపాలిటీ వార్డుల విభజనలో గందరగోళం..!
– వార్డుల విభజనపై పార్టీల అభ్యంతరాలు
– క్లాక్ వైస్ విభజించామని చెబుతున్న అధికారులు
– వివర్స్ కాలనీ నాయకపు వాడలు రెండు ముక్కలు
– మున్సిపల్ ఎన్నికలు సాఫీగా సాగేనా..?
ములుగు, జనవరి5, తెలంగాణజ్యోతి : తెలంగాణ ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎలక్షన్లో సన్నహాలు చేస్తున్న తరుణంలో కొత్తగా ఏర్పాటు అయిన ములుగు మున్సిపాలిటీ లో ఎన్నికలు సాఫీగా సాగేటట్లు కనిపించడం లేదు. వార్డుల విభజనలో వ్యత్యాసం కనిపిస్తోందని, అధికారులు చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో విభజించిన తీరుకు విమర్శలకు తావిస్తోంది. ములుగు మున్సిపాలిటీ ఏర్పాట్లు భాగంగా ములుగు మేజర్ గ్రామపంచాయతీలో జీవంతరావుపల్లి బండారుపల్లి గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ కొత్తగా మున్సిపాలిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం వార్డుల విభజనలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ములుగు మేజర్ గ్రామపంచాయతీలో 16 వార్డులు ఉండగా వార్డుల విభజనలో భాగంగా జీవంతరావుపల్లి గణేష్ లాల్ పల్లి లకు మొదటి స్థానం కల్పించారు అనంతరం బాల్సపల్లి గడిగడ్డ ప్రాంతాలను చేర్చుతూ చిందరవందరగా వార్డుల విభజన జరిగిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మేజర్ వార్డులైన రివర్స్ కాలనీ, నాయకుపవాడ లను చెరిసగం చేస్తూ వేరువేరు వార్డుల్లో కలపడం పట్ల ఆయా కాలనీవాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
– అధికార పార్టీ లోను అభ్యంతరాలు..
పంచాయతీరాజ్ చట్టం నిబంధనల మేరకు వార్డుల విభజన జరగాల్సి ఉండగా మున్సిపల్ అధికారులు రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలను అటు ప్రతిపక్ష పార్టీలతో పాటు అధికార పార్టీ నేతల్లోనూ వినిపిస్తోంది. విభజన చేసే సందర్భంలో పార్టీల అభ్యంతరాలు స్వీకరించ కుండా ఏకపక్షంగా వ్యవహరించాలని దీంతో గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతోందని ఆరోపిస్తున్నారు. వార్డుల విభజన అంశంపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉండడంతో అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. వివర్స్ కాలనీ ని రెండు విభాగాలుగా చేస్తూ ఏడవ వార్డులో, 19వ వార్డులో కలుపుతూ విభజించారు. బండారుపల్లినీ నాలుగు వార్డులుగా విభజిస్తూ 10 నుంచి 13 వార్డులుగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రేమ్ నగర్ ను ప్రగతి కాలనీ తో కలుపుతూ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న మాదిరిగా ములుగులోని 16 వార్డులకు జీవంతరావుపల్లి బండారుపల్లి లను కలిపి వార్డుల విభజన చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తేవి కాదని, కొత్త వార్డుల ఏర్పాటు గందర గోళాన్ని సృష్టిస్తుందని సోమవారం మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ పార్టీల నాయకులు అభ్యంతరాలను తెలిపారు. ఓటర్ లిస్టులో సైతం డబుల్ పేర్లు కనిపిస్తున్నాయని, వెంటనే సవరించా లని కమిషనర్ను కోరారు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధ మవుతున్న వేళ ములుగు రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న అభ్యంతరాలతో సాఫీగా సాగేనా అంటూ స్థానిక ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.






