అంకుషాపూర్ రైస్ మిల్ పై చర్యలు తీసుకోవాలని డిఎం ముందు రైతుల ఆందోళన
తెలంగాణ జ్యోతి, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుషాపూర్ రైస్ మిల్ పై చర్యలు తీసుకోవాలని డియం ముందు దామరకుంట గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అన్నపూర్ణ మాక్స్ సెంటర్ నిర్వాకులు, రైస్ మిల్లు యాజమాన్యం కుమ్మక్కై రైతులను నష్టపోరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు రైతులు డిమాండ్ చేశారు. స్వచ్ఛందంగా ఒక 40 బస్తాకు ఒక కేజీ ధాన్యం ఇచ్చిన ప్రతి లారీకి నాలుగు క్వింటాల ధాన్యం కట్ చేస్తున్నారని డిఎం రాఘవేంద్రకు రైతులు తమ ఆవేదన తెలిపారు.మెట్రాలజీ డిపార్ట్మెంట్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎంసి కాంటాలు నాణ్యమైనవీ కాకపోవడంతో ప్రతి లారీ తూకంలో వ్యత్యాసం వస్తుందని సెంటర్ నిర్వాహకులు రైతుల ముందు, డిఎం ముందు తెలిపారు. ఈ విషయం తెలపడంతో రైతులు మిల్లు యాజమాన్యం, అన్నపూర్ణ మ్యాక్స్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కుమ్మక్కై రైతులను నష్టపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు . పది లారీల ధాన్యం తూకంలో వ్యత్యాసం సంబంధించిన పత్రాలు డిఎంకు రైతులు చూపించారు. నష్టపోయిన రైతులకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని డిఎం రాఘవేంద్ర రైతులకు భరోసా కల్పించారు.