ఆర్టీసీ బస్ స్టేషన్ కు పూర్తిస్థాయి మంచి నీటి సరఫరా.
– మరమ్మత్తులకు నిధులు మంజూరు.
– శరవేగంగా మరమ్మత్తు పనులు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం నియోజకవర్గం లోని ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం టిఎస్ఆర్టిసి బస్ స్టేషన్ కు ప్రయాణికుల సౌకర్యం కోసం ఆర్టిసి మంచినీటి సౌకర్యం కల్పనకు శ్రీకారం చుట్టింది. సుమారు 34 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోఅప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 11 జనవరి 1989వ సంవత్సరం తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద రెండు పాయింట్ 80 లక్షల రూపాయలు వెంకటాపురం బస్ స్టేషన్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసింది. సుమారు మూడు దశాబ్దాల క్రితం వేసిన లభ్యమైన ఐరన్ పైపులు మంచినీటి సౌకర్యం, మరియు మరుగు దొడ్లకు నీటి సరఫరా కోసం అప్పటి కాంట్రాక్టర్లు పైపు ల్ల న్లు నిర్మించారు. అయితే ఐరన్ పైపులు తుప్పు పంటం తో సక్రమంగా బస్ స్టేషన్ కు మరుగు దొడ్లకు, మరియు, ప్రయాణీకులకు నీటి సౌకర్యం అరకొరగా అందుతున్నది .ప్రస్తు తం వెంకటాపురం బస్ స్టేషన్ కు భద్రాచలం డిపోకు చెందిన 14 బస్సులు, వరంగల్ రెండు డిపోకు చెందిన ఆరు బస్సులు, వెంకటాపురం బస్ స్టేషన్ నుండి ప్రతినిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 2,000 మంది ప్రయాణికులు వెంకటాపురం బస్ స్టేషన్ నుండి ప్రతినిత్యం భద్రాచలం, వరంగల్ రెండు డిపో బస్సుల ద్వారా ప్రయాణీకులు రాకపోక లు సాగిస్తున్నారు. ప్రయాణికులు సౌకర్యార్థం ప్రధానమైన మంచి నీటి సౌకర్యం కల్పనకు ఖమ్మం టిఎస్ఆర్టిసి రీజనల్ మేనేజర్, వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బస్ స్టేషన్లకు ప్రధానమైన మంచి నీటీ సౌకర్యం కల్పన కోసం మరమ్మత్తుల కోసం, టి ఎస్ ఆర్ టి సి టెండర్లను ఆహ్వానించారు. అందులో భాగంగా భద్రాచలం డిపో పరిధిలో ఉన్న నూగూరు వెంకటాపురం బస్ స్టేషన్ లో వాటర్ వర్క్స్ విభాగం ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పనులకు టెండ ర్ పొందిన కాంట్రాక్టర్ ను వేగవంతంగా పనులను ప్రారంభించి నాణ్యతా ప్రమాణా లతో పూర్తి చేయాలని ఆదేశించారు. మరో రెండు మూడు రోజుల్లో పాత పైపులు తొలగించి నూతన పైపులు ఏర్పాటు చేసే విధంగా కార్మికులతో పనులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా మరుగుదొడ్లకు 24 గంటలు నీటి సరఫరా, మరియు బస్ స్టేషన్ ఓవర్ హెడ్ ట్యాంకు పైపు లైన్ కలెక్షన్, త్రాగు నీటి ట్యాబులు తదితర సౌకర్యాలు కల్పించేందుకు పనులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అర్టీసీ వాటర్ వర్క్స్ పనులు నిర్వహించాలని, మేడారం జాతరను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆదేశంపై, మంచినీటి సౌకర్యం పై ఎటువంటి కంప్లైంట్లు, ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు సేవలు అందించాలని ఈ సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు, టి ఎస్ ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం ఖమ్మం టిఎస్ఆర్టిసి రీజనల్ మేనేజర్, మరియు భద్రా చలం డిపో మేనేజర్ పర్యవేక్షణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టిఎస్ఆర్టిసి బస్ స్టేషన్లలో వేగవంతంగా వాటర్ వర్క్స్ మరమ్మత్తులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచినీటి సౌకర్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని టిఎస్ఆర్టిసి ఉన్నతాధికారులు ఆదేశించారు.