బెస్తగూడెంలో కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాం. 

బెస్తగూడెంలో కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాం. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం పరిధి  బెస్తగూడెం గ్రామంలో శనివారం ఉదయం వెంకటాపురం పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ను  నిర్వహించారు . గ్రామ సర్పంచ్ చిడం లాలి బాబు, ఉప సర్పంచ్ మంచర్ల బిక్షపతి గ్రామ పెద్దలు, మరియు రైతులు యువత పాల్గొన్నా రు. వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రేఖ అశోక్ కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహించారు. ప్రధానంగా బెస్త గూడెం గ్రామంలో గుడుంబా తయారీ, అమ్మకం ను నిర్మూలించడానికి తీసుకోవలసిన చర్యలను గురించి, గ్రామస్తులకు అవగాహన కల్ఫించారు. గ్రామంలో ఉన్న ప్రతి యువకుడు ఒక యూనిఫామ్ లేని పోలీసుగా గ్రామంలోని గుడుంబా నిర్మూలనకు సహకరించ వలసిందిగా గ్రామ యావత్ యువతను కోరారు. అదే విధంగా గ్రామంలో సీ.సీ. కెమెరాలు నిఘానేత్రాలు ఏర్పాటు వలన గ్రామం యావత్తు కు, ప్రజలకు సి.సి. కెమేరాల వలన జరిగే ప్రయోజనాలను ఎస్.ఐ.అశోక్ వివరించారు. గ్రామంలో జరిగే కోడిపందాలు, పేకాట ,ఇతర కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు పోలీసు వారికి సమాచారం అందించవలసిందిగా పోలీసు వారి ఫోన్ నెంబర్లను గ్రామస్తులకు ఇవ్వటం జరిగింది. కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాంలో సివిల్ పోలీసులతోపాటు, సిఆర్పిఎఫ్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment