పంట పొలాల వద్ద విద్యుత్ పెన్సింగ్ వద్దు.

Written by telangana jyothi

Published on:

పంట పొలాల వద్ద విద్యుత్ పెన్సింగ్ వద్దు.

– ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

– ప్రజా ప్రతినిధులకు అవగాహన. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు, పేరూరు తో పాటు వెంకటాపురం పోలీస్ స్టేషన్ల లో శుక్రవారం ఆయా మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులతో పంట పొలాలకు విద్యుత్ పెన్సింగ్ ఏర్పాటు అంశంపై సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశంపై వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ ఆధ్వర్యంలో పేరూరు, వాజేడు, వెంకటాపురం పోలీస్ ఠాణా గ్రామాల పరిది లో అటవి ప్రాంతాల్లో, గోదావరి నది ప్రవాహక ప్రాంతాల్లో కొంతమంది రైతులు తమ పంటలను అడవి జంతువుల నుండి కాపాడుకునేందుకు విద్యుత్ పెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం వుందని తెలిపారు.విద్యుత్ పెన్షింగ్ పక్కన నుండి వెళ్లే రైతులు, ప్రజలు, పశువులు ,అడవి జంతువులు, పెన్సింగ్ కు తాకి ప్రాణాలు కోల్పోతున్నాయని,  ప్రజాప్రతినిధులు, ప్రజలు విద్యుత్ పెన్సింగ్ విధానాన్ని పూర్తిగా రూపుమాపాలని, ఆయా పోలీస్ స్టేషన్ ల సబ్ ఇన్స్పెక్టర్లు ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో ములుగు జిల్లాలో ఒక రైతు తమ పంట పొలానికి నీరు పెట్టేందుకు తన భార్యతో కలిసి వెళ్లి విద్యుత్ పెన్సింగ్ ను తాకి ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే నని తెలిపారు. మన ప్రాంతాల్లో అటువంటి సంఘటనలు జరగకుండా సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి తోటి రైతులు మరియు వన్య ప్రాణు ల ప్రాణాలు, కోల్పోకుం డా మనమంతా కలిసికట్టుగా విద్యుత్ ఫెన్సింగ్ విధానాన్ని రూపుమాపుదామని వాజేడు  పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి .రమేష్, వెంకటాపురం ఎస్.ఐ.ఆర్.అశోక్ ఆయా పోలీస్ స్టేషన్ పరిది లోని ఆయా పి.ఎస్. ఆవరణలో నిర్వహించిన ప్రజాప్రతినిధుల సమా వేశంలో కోరారు. వెంకటాపురం సి.ఐ .బి. కుమార్ ఆధ్వ ర్యంలో విద్యుత్ పెన్సింగ్ విధానం రూపు మాపుదామని సోదర అన్నదాతలు మరియు,ప్రజలు , వన్యప్రాణుల ప్రాణా లు కాపాడుకుందాం అని కోరారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, జూదం పేకాట, గంజాయి, గుడుంబా తయారీ విక్రయాలు, రవాణా ఇంకా అనేక చట్ట విరుద్ద అంశాలపై ప్రజాప్రతినిధుల సమావేశంలో వివరిం చారు. ఈ మేరకు ఆయా సర్పంచ్ లు ప్రజాప్రతినిధులు తమ,తమ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ పెన్సింగ్ పై టామ్ టామ్,  చాటింపు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి, శాంతి భద్రతల పరిరక్షణలో స్నేహ పూర్వక రక్షక భట విధానాల్లో శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని, ప్రజా ప్రతినిధులు రక్షక భట శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్, వెంకటాపురం, వాజేడు పేరూరు సివిల్ పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు ఆర్ .అశోక్, వెంకటేశ్వరరావు, జి .రమేష్ లు  ప్రజాప్రతినిధుల సమా వేశంలో ప్రజాప్రతినిధులకు శాఖ తరపున ప్రజా రక్షణ, పరిరక్షణ కోసం విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now