బిజినేపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

బిజినేపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం బిజినేపల్లి గ్రామంలో ఆదివారం వాజేడు పి.ఎస్.సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీష్ కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిద అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అసాంఘిక శక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని కోరారు. అలాగే గ్రామీణ యువత విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ముందుకు రాణించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు, గంజాయి, గుట్కా, జూదం ఇతర చెడు వ్యసనాలకు దూరంగా పుండాలని ఇంకా పలు భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే సైబర్ క్రైమ్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, గిరిజన సంక్షేమ పథకాలను సద్విని యోగం చేసుకోవాలని ఎస్.ఐ.హరీష్ కోరారు. ఈ కార్యక్రమంలో వాజేడు పి.ఎస్ సివిల్ పోలీస్ సిబ్బందితో పాటు, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment