టి టి డబ్ల్యూ ఆర్ డిసి కళాశాలలో యోగ
తెలంగాణజ్యోతి, ఏటూరు నాగారం: శారీరకంగ,మానసికం గా సంపూర్ణ ఆరోగ్యానికి యోగబ్యాసం సులువైన సాధనమ ని టి టి డబ్ల్యూ ఆర్ డి సి బాలికల డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం పిఓ డాక్టర్ రాధిక అన్నారు. శనివారం అంతర్జా తీయ యోగా దినోత్సవం సందర్భంగా కళాశాలలో యోగా బ్యాస ప్రదర్శన నిర్వహించారు. కళాశాలలో జాతీయ సేవా పథకం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 100 మంది విద్యార్థులు వివిధ రకాలైన యోగాసనాలు ప్రదర్శించారు. యోగా దినోత్సవం పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి ఉమాదేవి, బోధన, బోధ నేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.