కాటారంలో కాలేజీ హాస్టళ్లను ఏర్పాటు చేయాలి
– మంత్రి శ్రీధర్ బాబుకు ఎస్ఎఫ్ఐ నేత బొడ్డు స్మరన్ వినతి
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: కాటారం సబ్ డివి జన్ పరిధిలోని వివిధ విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మేనేజ్మెంట్ హాస్టల్ల ను నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరన్ కోరారు. ఈ మేరకు గురువారం కాటారం మండలంలో పర్యటించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు స్మరన్ విలేకరులకు వివరిం చారు. కాటారం మండలంలో దామెరకుంట సోషల్ వెల్ఫేర్ గురుకులానికి స్వంత భవనం నిర్మించాలని కోరారు. గత 10 సంవత్సరాల నుండి నిర్మాణ పనులు కొనసాగుతున్న మహా ముత్తారం దొబ్బలపాడు మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని ఎస్ ఎఫ్ ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరన్ డిమాండ్ చేశారు. భారత విద్యార్థి సమైక్య ( ఎస్ఎఫ్ఐ ) జిల్లా అద్యక్షులు బొడ్డు స్మరన్ మాట్లాడుతూ చుట్టూ నాలుగు మండలాలకు కేంద్రంగా విద్యా రంగంకు సంబందించిన ఇంటర్ తో పాటు ఐటిఐ, పాలిటెక్నిక్, పారామెడికల్, ఒకేషన ల్, డిగ్రీ, ప్రభుత్వ ప్రవేట్ కలాశాలలలో వందల సంఖ్యలో విద్యార్థులు కాటారం మండల కేంద్రంలో విద్యను అభ్యసిస్తు న్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు, ప్రతి రోజు బస్ ఛార్జీలు లేక, రూమ్స్ లో ఉండి చదువుకునే స్థోమత లేక, విద్యను మధ్యలో ఆపి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాటారం డివిజన్ కార్యదర్శి కిషోర్, ముత్తారం మండల అధ్యక్షుడు శ్రావణ్, డివిజన్ కమిటీ సభ్యుడు తరుణ్ తదితరులు పాల్గొన్నారు.