కుల గణన సర్వేను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ 

కుల గణన సర్వేను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గనన సర్వే కార్యక్రమాన్ని గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి పరిశీలించారు. కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఆమె ఇంటింటికి తిరిగి సర్వే అమలు తీరును పరిశీలించారు. స్టిక్కర్లు అంటిం చారా లేదా అని ఆరా తీశారు. కుటుంబ సభ్యుల సమాచా రాన్ని తెలియజేయాలని ఆమె కోరారు. ఆమె వెంట కాటారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి అడ్డూరి బాబు, మండల పంచాయతీ అధికారి పిల్లి వీరస్వామి, పంచాయతీ కార్యద ర్శులు, కుల గనన సర్వే ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment