Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గిరిజన కుటుంబాలకు దుస్తుల పంపిణీ

On: January 11, 2026 5:57 PM

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గిరిజన కుటుంబాలకు దుస్తుల పంపిణీ

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గిరిజన కుటుంబాలకు దుస్తుల పంపిణీ

కన్నాయిగూడెం, జనవరి 11 (తెలంగాణ జ్యోతి): మండలంలోని చింత గూడెం గ్రామపంచాయితీ పరిధిలోని కొయ్యురు గొత్తికోయ గూడెంలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యం లో దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు జిష్ణుదేవ్ వర్మ ఆదేశాల మేరకు, ములుగు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు దివాకర టి.ఎస్. సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు. అభయ ఫౌండేషన్ అందించిన దుస్తులను చింతగూడెం సర్పంచ్ అల్లెం అనిత నర్సింగరావు, ఉపసర్పంచ్ దుర్గం అనిత ప్రభాకర్, బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు, కన్నాయిగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యండి అఫ్సర్ పాష, రెడ్ క్రాస్ జిల్లా పాలక మండలి సభ్యుడు ముస్కు గోవర్ధన్ రెడ్డి కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగల సుమన్, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ నెంబర్ సునార్కని రాంబాబు, మాజీ ఉపసర్పంచ్ జంగా కృష్ణ, యూత్ అధ్యక్షుడు గోస్కుల నవీన్, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ గోస్కుల సదన్ రావు, యూత్ నాయకులు మహేష్, సాంబయ్యతో పాటు గొత్తి కోయ గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!