గిరిజనుల అభివృద్ధి ని పూర్తిగా విస్మరించిన కేంద్ర బడ్జెట్

Written by telangana jyothi

Published on:

గిరిజనుల అభివృద్ధి ని పూర్తిగా విస్మరించిన కేంద్ర బడ్జెట్

– ఏ. ఎన్. ఎస్ రాష్ర్ట అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : 2024-25 కేంద్ర బడ్జెట్లో గిరిజన సంక్షేమానికి భారీగా నిధులు కేటాయిం చినట్టు మోడీ ప్రభుత్వం అంకెల గారడీ చేసిందని, ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి గురువారం ఒక పత్రికా ప్రకటనలో విమర్శించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో, అన్ని అవాస్తవాలు మాట్లాడారని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమానికి గతేడాది రూ.7,273 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.13,000 కోట్లు కేటాయించి నట్టు చెప్పడం పార్లమెంటు సాక్షిగా దేశంలోని పది కోట్లమంది గిరిజనులను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. 2023-2024 బడ్జెట్లో రూ. 12,461 కోట్లు కేటాయించినప్పటికీ వాస్తవాన్ని చెప్పకుండా, సవరించిన అంచనా రూ. 7,273 కోట్లు మాత్రమే చెప్పి, అంకెల గారడీకి పాల్పడిందన్నారు. గిరిజనుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించామని నమ్మించే ప్రయత్నం చేశారని విమర్శించారు. కేవలం ఈ బడ్జెట్ లో రూ.539 కోట్లను మాత్రమే పెంచిందని తెలిపారు. దేశంలోని 700 వందల ఆదివాసీ,గిరిజన తెగల్లో నిరుద్యోగం, ఉపాధి లేమి తీవ్రస్థాయిలో పెరిగిన నేపథ్యంలో, వారికి ఎన్ఎస్ఎఫ్ఎసీ ద్వారా ఆర్ధిక అభివృద్ధికి రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. అరకొరనిధులను కేటాయించి వారిని మరింత పేదరికంలోకి నెట్టే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల ముందు, నరేంద్ర మోడీ గొప్పగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ వాస్తవికం లో అది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం భవనాలు, ఉద్యోగులు, విద్యార్థులకు ప్రవేశా లు కల్పించకుండానే ,బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించ కుండా సెంట్రల్ యూనివర్సిటీ గ్రాంట్లలో విలీనం చేశామని చెప్పడం అత్యంత బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.ఆదివాసీలు నేటికీ ఉన్నత విద్యను అందుకోలేక పోతున్నారని అన్నారు. గిరిజన తెగల ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్న నేపథ్యంలో అత్యంత వెనుకబడిన గిరిజన తెగల అభివృద్ధికి గత బడ్జెట్లో రూ.256 కోట్లు కేటాయించగా ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.20 కోట్లు మాత్రమే కేటాయిం చడం వారి పట్ల ఉన్న నిర్లక్ష్యమేనని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో కొచ్చిన పదేండ్ల కాలంలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి మరింత క్షీనించిందని విమర్శించారు. స్వతంత్రం సిద్దించి 77 ఏళ్ళు గడిచిన నేటికీ ఆదివాసీ ల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎటువంటి ప్రయత్నాలు కేంద్రం చేయడం లేదన్నారు. బడ్జెట్లో గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను సైతం దారి మళ్లించిందని ఆరోపించారు. గిరిజన సబ్ ప్లాన్ గత బడ్జెట్లో 102 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ. లక్షా 19 వేల కోట్లు కేటాయించగా ఇందులో కేవలం 25 శాతం నిధులను మాత్రమే అరకొరగా ఖర్చు చేసి, మొత్తం ఖర్చు చేశామని కేంద్రం దొంగ లెక్కలు చూపుతోందని విమర్శించారు.ఈ ఏడాది సబ్ ప్లాన్ కింద రూ. లక్షా 24 వేల కోట్లు కేటాయించిందనీ, సబ్ ప్లాన్ నిధులు నేరుగా గిరిజనుల అభివృద్ధికే ఖర్చు చేయాలనీ, ఇతర జనరల్ పథకాలకు దారి మళ్లించకూడదనీ, రాజ్యాంగ నియమాలు ఉన్న వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడానికి వేలకోట్లు దారి మళ్లిస్తున్నదని ఎ.ఎన్.ఎస్. నేత నర్సింహమూర్తి విమర్శించారు. ఈ దేశాన్ని ఆర్ధికంగా ఆదుకునేది దేశంలోని గిరిజన ప్రాంతాలే అన్నారు. దేశ బడ్జెట్ లో ఎన్ని లక్షల కోట్లు ప్రవేశపెట్టిన అందులో సగ భాగం గిరిజనులదే అని తెలిపారు. గిరిజన ప్రాంతాల నుండి తరిలించే ఖనిజ సంపద తోనే ఈ దేశ అభివృద్ధి జరుగుతోందని జర్మనీ జనరలిస్ట్ వాల్టర్ ఫర్నేండేజ్ ప్రచురిస్తే నరేంద్ర మోడీ ఒప్పుకోక పోగా, ఆ జర్నల్ ని ప్రచురించ కుండా అడ్డు కోవడం జరిగిందని పేర్కొన్నారు. నేటికీ ఆదివాసీలు మెరుగైన వైద్యం అందక దోమకాటు కు గురై చనిపోతున్నట్లు తెలిపారు. ప్రతియేటా మాతా శిశు మరణాల పెరుగుతోందన్నారు. పౌష్టికాహార లోపం కారణంగా ప్రతి వెయ్యిమంది శిశువుల్లో, 36 మంది మరణిస్తూ ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో అయినా ఆదివాసీల సర్వతో ముఖాభివృద్ధి ని ప్రతిభింభిం చేలా ఆశా జనకంగా ఉండాలని ఆదివాసీ గిరిజన తెగలు ఎదురు చూస్తున్నట్లు ఎఎన్ఎస్ రాష్ర అధ్యక్షులు నర్సింహ మూర్తి పేర్కొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now