ఘనంగా ఐలమ్మ 129 వ జయంతి వేడుకలు
తెలంగాణ జ్యోతి ఏటూరునాగారం : భూమి కోసం భుక్తి కోసం పోరాడిన వీర వనిత చిట్యాల ఐలమ్మ 129 వ జయంతి వేడుకలను ఏటూరునాగారం మండల కేంద్రంలోని రజక వాడలో రజకులంతా ఏకమై ఘనంగా నిర్వహించారు. మొదటగా ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కొబ్బరికాయలు కొట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం చేత కొడవలి పట్టి కొంగు నడుము చుట్టి దొరల గుండెల్లో గుబులు పుట్టించి వీర వనిత చిట్యాల ఐలమ్మ చేసిన సాయు ధ పోరాటాన్ని స్మరించుకున్నారు. అనంతరం మిఠాయిలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పర్వతాల ఎల్లయ్య, పర్వ తాల కుమారస్వామి, పర్వతాల అశోక్, పర్వతాల రమేష్, కుదురుపాక రాజేశ్, కుదురుపాక ప్రవీణ్,పర్వతాల రాజ్ కుమార్,వడ్డేపల్లి హరీష్, కుమ్మరికుంట్ల సతీష్, పర్వతాల బిక్షపతి, పర్వతాల నర్సింహులు, పర్వతాల ఎల్లయ్య, మడిగిల నరేష్,పర్వతాల విష్ణు, పర్వతాల మిధ్వన్ సాయి, పర్వతాల సంతోష్, వడ్డేపల్లి వెంకటేశ్వర్లు,పర్వతాల చిన్న రాంబాబు, పర్వతాల పెద్దోడు,కుదురుపాక గిరిబాబు, పర్వ తాల తేజ, పర్వతాల రవి, గాదె వెంకటేశ్వర్లు లక్ష్మి, ఉషారాణి, మమతా, ధనలక్ష్మి, సుష్మిత, దివ్య, కొమురమ్మ, ప్రమీల, జానకి, రోజా, పద్మ, సరితా, మాధవి, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.