ఘనంగా మహాత్మ జ్యోతి రావు పూలే 197వ జయంతి వేడుకలు
తెలంగాణ జ్యోతి ప్రతినిధి, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో బహుజన్ సమాజ్ పార్టీ కాటారం మండల అధ్యక్షుడు బొడ్డు రాజబాబు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను పురస్కరించుకుని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ మండల అధ్యక్షులు బొడ్డు రాజబాబు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాలకు అభ్యున్నతికి, విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మానవతావాది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. సమాజంలోని ప్రజలందరూ మహనీయుల ఆలోచన విధానంలో నడవాలని బొడ్డు రాజబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం బిఎస్పి మండల ప్రధాన కార్యదర్శి ఎండి మౌలానా, నాయకులు మెట్టు పురుషోత్తం , బాపు తదితరులు పాల్గొన్నారు.