వాడ బలిజలకు సకాలంలో కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలి. 

Written by telangana jyothi

Published on:

వాడ బలిజలకు సకాలంలో కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలి. 

– బీసీల సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి.

– రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం అధ్యక్షులు డర్రా దామోదర్. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : వాడబలిజ కులస్తులకు కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలు సకాలంలో మంజూరు చేయాలని, ప్రభుత్వం అమలు పరుస్తున్న బీసీల సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ మంజూరు చేయాలని వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ములుగు జిల్లా మంగపేట మండలంలో వాడబలిజ సేవా సంఘం సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి ఏకగ్రీవం గా తీర్మానం ఆమోదించారు. వెంకటాపురం వాస్తవ్యులు అయిన వాడబలిజ సేవా సంఘం అధ్యక్షులు డి.దామోధర్ వెంకటాపురంలో బుధవారం సాయంత్రం మీడియాకు సమావేశం వివరాలను విడుదల చేశారు. వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో, మంగపేట మండలంలో గతంలో వాడబలిజ బెస్త కులస్తులుగా కొంతమంది సర్టిఫికెట్లు తీసుకోవడం జరిగింద ని తెలిపారు. వాటిని మార్చి వాడ బలిజ బీ.సీ.ఏ. గా సర్టిఫికెట్లు ఇవ్వాలని సంబంధిత మంగపేట మండల తాసిల్దార్ కు విన్నవించారు. వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ ఆధ్వర్యంలో మంగపేట మండల తాసిల్దార్ కు సంఘం లెటర్ ప్యాడ్ పై మెమోరండం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల వాడబలిజ సేవా సంఘం అధ్యక్షులు గౌరారపు రాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి తోట తిరుపతి, కోశాధికారి బొల్లె రాములు, గ్రామ కమిటీ అధ్యక్షుడు బొల్లె హనుమంతు, ఉపా ధ్యక్షులు బొల్లె శ్రీనివాస్, కార్యదర్శి బద్ది రఘుబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ బద్ది పాపారావు, ముఖ్య సలహాదారులు గగ్గురి మహేష్, ఎర్రావుల, రమేష్, కార్యవర్గ సభ్యులు గౌరయ్య, రాజేష్, శ్రావణ్, భాను ,రఘు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment