అక్రమంగా తరలిస్తున్న టేకు కలప పట్టివేత
– వెంకటాపురం – చర్ల రహదారి ఆలుబాక వద్ద స్వాధీనం
– వెంకటాపురం రేంజ్ కార్యాలయానికి తరలింపు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం ఫారెస్ట్ సబ్ డివిజన్ వెంకటాపురం రేంజి పరిధి లోని ఆలుబాక వద్ద ఫారెస్ట్ అధికారులకు మంగళవారం రాత్రి జైలో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలప వాహనం తో సహా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్. వంశీకృష్ణ కథనం ప్రకారం… ఆలు బాక సెక్షన్ ఆఫీసర్ చంద్రమోహన్, బీట్ ఆఫీసర్ అరుణకుమార్ బేస్ క్యాంపు సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు ఆలుబాక వద్ద జైలో వాహనాన్ని తనిఖీ చేయగా టేకు కలప దుంగలు ఉన్నాయి. వాహనాన్ని నిలిపిన డ్రైవర్ చీకట్లో పరారయ్యాడు. కలప వాహనాన్ని స్వాధీనం చేసుకొని వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. అయితే కలప విలువ, కేసు నివేదికను ఎఫ్ డి ఓ కు పంపనున్నట్లు తెలిపారు. కలప విలువ వివరాలను, కొలతలు వేసిన అనంతరం తెలుపుతామని ఎఫ్ఆర్ఓ వంశీకృష్ణ మీడియాకు తెలిపారు. అక్రమ కలప రవాణ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియపరచాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.