రూ.1.9 కోట్ల విలువైన ఎండు గంజాయి దహనం : ఎస్పీ కిరణ్ ఖరే 

Written by telangana jyothi

Published on:

రూ.1.9 కోట్ల విలువైన ఎండు గంజాయి దహనం : ఎస్పీ కిరణ్ ఖరే 

భూపాలపల్లి  ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: జయశంకర్    భూపాలపల్లి జిల్లాలో రూ.1.9 కోట్ల విలువైన ఎండు గంజాయిని శుక్రవారం దహనం  చేసినట్లు శుక్రవారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పి కిరణ్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ గంజాయి రవాణాపై పోలీసు లు ఉక్కుపాదం మోపి, గంజాయి నిర్మూలనకు నిరంతర నిఘా పెడుతూ, వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2020 నుంచి 25 కేసుల్లో ఒక కోటి 59 లక్షల విలువ గల 636 కిలోల ఎండు గంజాయిని స్వాధినం చేసుకుని, డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆద్వర్యంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం హన్మకొండ సుబేదారీ లోని కాకతీయ మెడిక్లిన్ వద్ద సైంటిఫిక్ పద్ధతిలో దహనం చేసినట్లు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు అలవా టు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని, జిల్లాలో గంజాయి, డ్రగ్స్ పై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో నూరేళ్ల జీవితం నాశనం అవుతుం దని ఎస్పి పేర్కొన్నారు. యువత విద్యార్థులు చెడు స్నేహాల తో సరదాగా ప్రారంభించిన మాదకద్రవ్యాల వినియోగం, వారి భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు. జిల్లాలో అక్రమంగా మాదకద్రవ్యాలు రవాణా చేసినా, వినియోగించిన, విక్రయిం చిన, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి కిరణ్ ఖరే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సంపత్ రావు, రామ్మోహన్ రెడ్డి, నారాయణ నాయక్, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, జిల్లా పరిధిలోని రిజర్వు ఇన్స్పెక్టర్ లు, ఎస్ఐలు, పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now