వెంకటాపురంలో భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు బహిరంగ సమావేశం.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఎన్నికల ప్రచార సమావేశం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. వెంకటాపురం ఆర్టీసీ బస్ స్టేషన్ పక్కనే ఉన్న దేవస్థానం గ్రౌండ్లో ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ సమావేశం కు నియోజకవర్గ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న సమావేశానికి భారీ ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు .ఈ మేరకు టెంట్లు ,స్టేజి ఏర్పాట్లు తదితర పనులను ఉదయం నుండి ప్రారంభించారు. మండలంలోని పంచాయతీ పార్టీ కమిటీలు, మండల పార్టీ కార్యకర్తలు,నాయకులు , బాధ్యులు పార్టీ ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో సమావేశం హాజరు కావాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. వెంకటాపురంలో సమావేశం అనంతరం వాజేడు మండలంలో కార్యకర్తల సమావేశంలో కూడా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు పాల్గొంటారని పార్టీ వర్గాల ద్వారా సమాచారం.