బిఆర్ఎస్ కాటారం మండలం మైనార్టీ సెల్ కార్యవర్గం నియామకం
కాటారం డిసెంబర్ 4, (తెలంగాణ జ్యోతి): భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బిఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షునిగా షేక్ మున్వర్, బిఆర్ఎస్ మండల మైనార్టీ సెల్ మండల యూత్ అధ్యక్షుడిగా మీర్జా ముబీన్ బేగ్ ఎన్నికయ్యారు. కాటారం మండల కేంద్రానికి చెందిన షేక్ మున్వర్, మీర్జా ముబీన్ బేగ్ లను కాటారం మైనార్టీ మండల , యూత్ అధ్యక్షులుగా నియమించినట్లు మాజీ ఎమ్మెల్యే, మంథని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పుట్ట మధుకర్ ఆదివారం మండల కేంద్రంలో గల అయ్యప్ప ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా షేక్ మున్వర్, మీర్జా ముబీన్ బేగ్ మాట్లాడుతూ ఆయన నియామకానికి సహకరించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీ చైర్ పర్సన్ జక్కు హర్షిని రాకేష్, మాజీ అధ్యక్షుడు తోట జనార్దన్, బిఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ అధ్యక్షుడు జోడు శ్రీనివాస్ , కాటారం సర్పంచి పంతకాని సడవలి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీని బలపరిచేందుకు తన వంతుగా మైనార్టీ తోపాటు అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి రానున్న ఎమ్మెల్యే ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు.






