ప్రజలకు అండగా బిఅర్ఎస్ పార్టీ
-వెంటనే స్పందించి ఆర్ధిక అందజేసిన బిఅరెస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు
తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం:మండలంలోని గుర్రేవుల గ్రామానికి చెందిన వాసంపల్లి రమేష్ కుమార్తె శివలీల జ్వరం, వాంతులతో బాధపడుతూ ఏటూరునాగారం బన్ను ఆసుపత్రి లో చేర్పిం చారు. బన్ను ఆసుపత్రి వైద్యులు వారిని చూసి శివ లీలను మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తీసుకెళ్లాలని చెప్పడంతో రమేష్ తన కుమార్తెను హన్మకొండ శ్రీచక్ర ఆసు పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ములుగు జిల్లా బిఅర్ ఎస్ అధ్యక్షుడు కాకుళమర్రి లక్ష్మణ్‌బాబు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యంను కోరారు. అనంతరం కాకులమర్రి ప్రదీప్ 5 వేల రూ. ఆర్థిక సహాయం అందజేశారు. బిఅర్ ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతుందని ప్రదీప్ రమేష్ కి తెలిపారు.