పారిశుధ్యం లోపించిన బొర్లగూడెం
– పట్టించుకోని స్పెషల్ ఆఫీసర్
– పట్టింపు లేని కార్యదర్శి
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపా లపల్లి జిల్లా,మహాముత్తారం మండలం బోర్లగూడెం గ్రామ పంచాయతిలో పారిశుధ్యం లోపించినప్పటికి స్పెషల్ ఆఫీసర్ పట్టించుకోవడం లేదని ప్రజలు బహిరంగ విమర్శలు చేస్తు న్నారు. గ్రామంలో రోడ్ల ఇరువైపులా నీళ్లు నిలిచి ఉండడంతో దోమల బెడద విపరీతంగా పెరిగింది . నివారణకు చర్యలు, పట్టింపు లేకుండా గ్రామ కార్యదర్శి వ్యవహరిస్తున్నారని ప్రజ లు విమర్శిస్తున్నారు. గ్రామంలో రోడ్లకు రెండువైపులా బ్లీచింగ్ పౌడర్ చల్లించకపోవడం, గ్రామంలో వాడ వాడలో చెత్త కుప్ప లు తెప్పలుగా పడి ఉండటం విశేషం. రత్నం శేఖర్, ఓల్లాల సత్యనారాయణ ఇంటి ప్రక్కలో చెరువులు తలపించే విధంగా నీళ్ళు నిలిచి ఉన్నాయి దీనితో చుట్టూ ప్రక్కల వాళ్ళకి దుర్గంధపు వాసన వస్తుంది పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్ప టికైనా గ్రామ స్పెషల్ ఆఫీసర్ కల్పించుకొని పారిశుద్ధ్య నివా రణ చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.