ఎన్ హెచ్ ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్

Written by telangana jyothi

Published on:

ఎన్ హెచ్ ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్

– అప్రమత్తంగా ఉండాలని అదికారులు కు ఆదేశం. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం సీ.జి. సరిహద్దు టేకులగూడెం వద్ద జాతీయ రహదారి నెంబర్ 163 పై గోదావరి వరద నీరు చేరడంతో సోమవారం అర్ధరాత్రి నుండి రాకపోకలు నిలిపి  అధికారులు భారీకేడ్లను చేశారు. మంగళవారం రాత్రి వాజేడు మండల స్పెషల్ ఆఫీసర్ సర్ధార్ సింగ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారిని విజయ, పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి. కృష్ణ ప్రసాద్, గ్రామపంచాయతీ కార్యదర్శి రవీందర్, పంచాయతీ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సందర్శిం చారు.ఈసందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ గోదావరి వరద ఉధృతి తగ్గేవరకు ఫ్లడ్ డ్యూటీ అధికారులు అప్రమ త్తంగా ఉండాలని, భారీ వర్షాలు గోదావరి వరదల కారణంగా ఆయా గ్రామాల్లో చేపల వేటకు వెళ్ళద్దని, వాగులు దాటవ ద్దని, వరద భద్రతాపరమైన హెచ్చరికలు జారీ  చేశారు.

Leave a comment