మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : భద్రాచలం హాస్పటల్ లో చిన్ననాటి స్నేహితులు, ట్రస్ట్ సభ్యులు బాబుకి ఏ పాజిటివ్ బ్లడ్ కావాలని అదిగిన వెంటనే ముందుకు వచ్చి ఏ పాజిటివ్ గ్రూపు రక్తాన్ని అందించి మానవత్వాన్ని ట్రస్టు సభ్యులు అన్వర్ ఫాషా చాటారు. భద్రాచలం పట్టణానికి చెందిన 11 సంవత్సరాల బాబు క్రాంతి కిరణ్ తల సేమియా వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈ బాబు కు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొని వుంది.15 రోజులు కావడంతో వైద్యులు రక్తం ఎక్కించాలని సూచించగా రక్తం కోసం ట్రస్టును ఆశ్రయిం చారు. వెంటనే స్పందించి ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు ఎస్డీ .అన్వర్ ఫాషా శనివారం స్థానిక రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు ఏ పాజిటివ్ బ్లడ్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతకు ట్రస్ట్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.