Medaram | మినీ మేడారం జాతర తేదీలు ఖరారు
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం : ఆసియా ఖండం లోనే అతి పెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారల మ్మ జాతర తేదీలను పూజార్ల సంఘం అధ్యక్షులు సిద్ధ బోయిన జగ్గారావు, పూజారులు ఖరారు చేసి ప్రకటించారు. ఫిబ్రవరి 12 బుదవారం నుండి ఫిబ్రవరి 15 శనివారం వరకు జరిగే నాలుగు రోజుల మినీ జాతరను విజయవంతం చేయా లని పూజార్ల సంఘం అధ్యక్షులు సిద్ధ బోయిన జగ్గారావు ప్రకటన ద్వారా తెలిపారు.