అవినీతిలో కూరుకుపోయిన బిజెపి

Written by telangana jyothi

Published on:

అవినీతిలో కూరుకుపోయిన బిజెపి

తెలంగాణజ్యోతి, ములుగు ప్రతినిధి : అవినీతిలో కూరుకు పోయిన బిజెపి అనే పుస్తకాన్ని ములుగు జిల్లా కేంద్రంలో  ప్రజాసంఘాలు ఆవిష్కరించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్ ఎండి అహ్మద్ పాషలు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, బిజెపి అనుసరిస్తున్న ప్రభుత్వ తిరోగమన విధానాలు, అవినీతి ఊబిలో కూరుకుపోయిన బిజెపి, పియం కేర్స్ ఒక పెద్ద కుంభకోణం, సమాచార హక్కు చట్టంను అపహస్యం చేశారన్నారు. ఆర్టిఐ క్రియాశీలక కార్యకర్తలు చంపబడ్డారని, ఎన్నికల బాండ్లను చట్టబద్దం చేసిన అవినీతికర ప్రభుత్వమని, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ద్వారా చనిపోయిన వారి పేర్ల పైన దోపిడీ చేశారన్నారు. మైనార్టీల పేరు మీద సైతం దోపిడీ జరిగింద ని అన్నారు. ఆదాని, అంబానీల కోసం బిజెపి ప్రభుత్వం చట్టాలను కూడా సవరిస్తుందోన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్ గా కుదించిందన్నారు. అది యాజమాన్యా లకు లాభం చేకూరే విధానాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ ఐ సి, ఎయిర్ లైన్స్, పోర్టులు, గనులు, రైల్వే లను సైతం, ప్రైవేటీకరించడం అంటే ఇంతకంటే దోపిడీ విధానం ఏముం దన్నారు. ఒకప్పుడు ప్రైవేట్ రంగాన్ని ప్రభుత్వ రంగంగా మార్చేవారు, కానీ నేడు ప్రభుత్వ రంగం మొత్తం ప్రైవేటీ కరించే దిశగా ప్రయాణిస్తున్నారన్నారు. ఎన్నికల బాండ్లను తీసుకురావడం వల్ల, మాకు చందాలు ఇవ్వండి, మీరు ఎంతైనా సంపాదించుకోండ్డి అన్నట్లుగా ప్రభుత్వ విధానాలు ఉన్నవన్నారు. అందుకే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలు, ప్రజలకు తెలియకుండా ఉండే అవి నీతిని అంతమొందిం చడానికి బిజెపి ప్రభుత్వాన్ని, దాని ద్వారా పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థులను కలిసికట్టుగా ప్రజలందరూ ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కైరి మొగిలి, ఎండి, అంకూష్, ఇనుముల సుధాకర్, రాంజీ, గండి కుమార్, సిపిఐ నాయకులు ముత్యాల రాజు, బండి నర్సయ్య, ఇంజం కొమురయ్య లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

1 thought on “అవినీతిలో కూరుకుపోయిన బిజెపి”

Leave a comment