ఇంటింటా బిజెపి ప్రచారం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల నేపథ్యంలో జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. గురువారం కాటారం మండలంలోని విలాసాగర్ లో బిజెపి పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బూత్ నెంబర్ 157లో బూత్ అధ్యక్షుడు జోడు రాజు ఆధ్వర్యంలో విలాసాగర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ గెలుపు లక్ష్యంగా నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానిగా చేయాలని సంకల్పంతో ఇంటింటా కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బండo మల్లారెడ్డి, మండల నాయకులు పూసాల రాజేంద్రప్రసాద్, డోలీ అర్జయ్య, బొంతల రవి, జిల్లెల్ల శ్రీశైలం, ఆత్మకూరు స్వామి యాదవ్, మంత్రి సునీల్, విలాస్ గ్రామ యువకులు పాల్గొన్నారు.
1 thought on “ఇంటింటా బిజెపి ప్రచారం ”