కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామం నుండి మండల బి ఆర్ఎస్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇమ్రాన్ మరియు 40 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మెంగాని అశోక్ ,ఎంపీటీసీ మమత నాగరాజు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ&శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పెద్దపెల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీ కృష్ణ గెలుపుకై అందరూ కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం గ్రామ శాఖ అధ్యక్షుడు మంగాయి లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు మంగాయి సడవలి, జానీ తదితరులు పాల్గొన్నారు.
1 thought on “కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం.”