బయోలాజికల్ సైన్స్ ఫోరం జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ విజయవంతం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : అత్యధిక మార్కులతో జిల్లా ప్రథమ స్థానంలో ఎ.అజయ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జంగేడు. జిల్లా స్థాయి బయాలజీ టాలెంట్ టెస్ట్ ఈ రోజు స్థానిక భూపాలపల్లి ఉన్నత పాఠశాలలో టీ బీ ఎస్ ఎఫ్ అధ్యక్షులు బి.ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా జిల్లా సీఎంఓ సామల రమేష్, భూపా లపల్లి మండల విద్యాధికారి దేవానాయక్, స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ ప్రసన్న, జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి హాజరయ్యారు. మండల స్థాయిలో విజేత లుగా నిలిచిన పదవ తరగతి విద్యార్థులు 11 మండలాల నుండి జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ కు హాజరయ్యారు. ప్రారంభ సమా వేశంలో విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ప్రాథ మిక స్థాయి నుండి సైన్స్ ను పరిసరాలను పరిశీల ద్వారా అభ్యసించాలని దేవా నాయక్ సూచించారు. జీవశాస్త్ర అధ్యయ నం ద్వారా భవిష్యత్తులో బయోటెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరిం గ్, మెడికల్, అగ్రికల్చర్ రంగాలలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉంటాయని లక్ష్మీ ప్రసన్న తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి స్వామి మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశం అభివృద్ధి చెందాలంటే, విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని, వినూత్న ఆలోచనలు పెంపొందించుకోవాలని కోరారు. తెలంగాణ బయో లాజికల్ సైన్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లా డుతూ జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులు ఈనెల 28న జరగనున్న రాష్ట్రస్థాయి టాలెంట్ లో పాల్గొంటారని తెలిపారు. టాలెంట్ టెస్ట్ కే. శ్రీనివాస్ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించామని రాష్ట్ర కమిటీ సభ్యురాలు డాక్టర్. మార్క వీణావాణి తెలియజేశారు. తెలుగు మీడియం విభాగంలో ప్రథమ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాలేశ్వరం విద్యార్థి కె.అలేఖ్య, ద్వితీయ స్థానం మహాదేపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థి కే.వంశీ గెలుచుకున్నారు. ఇంగ్లీష్ మీడియం విభాగంలో ప్రథమ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జంగేడు విద్యార్థి కే అజయ్, ద్వితీయ స్థానంలో మోడల్ స్కూల్ ఎడ్లపల్లి విద్యార్థిని హారిక గెలుపొందింది. తృతీయ స్థానంలో కె.రామ్ చరణ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెల్పూర్ విద్యార్థి గెలుచుకున్నాడు. అనంతరం విద్యా ర్థులకు సర్టిఫికెట్లు మరియు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బయాలజీ టీచర్ ఫోరం ఆర్థిక కార్య దర్శి ఎస్. కుమారస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుర్రి శ్రీనివా స్, మామిడి సురేష్, హెచ్. సమ్మయ్య, సునీల్, సంపత్ కుమార్, రాజు, ఈ కుమారస్వామి, సేవా నాయక్, కరుణశ్రీ, సువర్ణ , కామిడి సతీష్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.