భక్తులకు మెరుగైన వైద్య సేవలు : హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్.
ములుగు, తెలంగాణ జ్యోతి : సమ్మక్క సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ అన్నారు. గురువారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆయనకు పూజారులు డోలు సన్నాయి వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన సమ్మక్క సారలమ్మలకు పసుపు కుంకుమ సీరె,సారె పూలు పండ్లు సమర్పించి మొక్కలు చెల్లించా రు. తదనంతరం మేడారంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులను తనిఖీ చేసి మేడారం వచ్చే భక్తులకు ఏ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం వైద్యం పొందుతున్న పేషెంట్లను ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. పేషెంట్ ను పరిశీలించి పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలోవైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శివప్రసాద్, డి ఎమ్ హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య, డి సి హెచ్ డాక్టర్ జగదీశ్వర్,ఎటూరు నాగారం సూపర్నెంట్ డాక్టర్ సురేష్, ప్రేమ్ సింగ్, ప్రసాద్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.