భవిష్యత్తులో సంభవించే గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
– వెంకటాపురం ఎస్సై తిరుపతి రావు.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : భవిష్యత్తు లో సంభవించే గోదావరి వరదలు, భారీ వర్షాలు సందర్భంగా సంభవించే ప్రక్రుతి వైపరీత్యాల పట్ల, ముంపు కు గురి అయ్యే గ్రామాల ప్రజలు, ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు కోరారు. మంగళవారం మండల పరిధిలోని ఉప్పెడు వీరాపురం పంచాయతీ పరిధి లో గోదావరి వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీస్ మరియు, ఇతర ఫౌర శాఖల సహాయ సహకారాలు అంశాలపై , గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గతం లో సంభవించిన గోదావరి వరదల సమయంలో, ప్రభుత్వ రికార్డుల ప్రకారం ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను ముందస్తు గానే, వరదలు సమయంలో అప్రమత్తంగా ఉండే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్.ఐ. తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం ఎస్సై కే. తిరుప తిరావు సివిల్ పోలీస్, మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.