శిధిలావస్థలో పాఠశాల.. ప్రమాదపుటంచున బడి పిల్లలు…
– భవనాన్ని కూల్చివేసి నూతన భవనం నిర్మించాలి
– గ్రామస్థుల ఆవేదన
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం చింతగూడెం పాఠశాలలో గతం లో నిర్మించిన భవనం శిధిలావస్థకు చేరుకుంది. ఏ క్షణాన ఎం జరుగుతుందోనని విద్యార్థుల్లో భయం నెలకొంది. శిధిలావ స్థకు చేరుకున్న భవనం కూల్చివేయడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు. పిల్లలకు ప్రమాదం జరు గుతనే తప్ప పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామ స్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదపుటంచున బడి పిల్లలు
పురాతన భవనం కావడంతో ఏ క్షేణమైన కూలితుందోనని బడి పిల్లలు భయపడుతున్నారు. వర్షం వస్తే భవనం చుట్టూ నీరు నిలిచిపోతుంది. పిల్లలకు ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడాలి.
భవనాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలి
పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా భవనా న్ని కూల్చి వేయాలి.వెంటనే అధికారులు దృష్టి సారించి నూతన భవనానికి నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.