నిర్లక్ష్యంగా వదిలేసిన బీసీ మర్రిగూడెం వాటర్ ట్యాంకర్
– గతంలో ట్రాక్టర్ ట్రాలీ చోరీ – పట్టించుకోని గ్రామపంచాయతీ
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం శివారు బీ.సీ మర్రిగూడెం మినీ పంచాయతీకి చెందిన, ట్రాక్టర్ ట్రాలీ సుమారు మూడు నెలల క్రితం నిర్లక్ష్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో వదిలేయడంతో చోరీకీ గురైంది. సుమారు లక్షా 50 వేల రూ. విలువైన ట్రాక్టర్ ట్రాలీ వెంకటాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్లక్ష్యంగా వదిలేయడంతో దొంగల పాల య్యింది. వెంకటాపురం పోలీసులకు ఫిర్యాదు చేసి పంచాయ తీ కార్యదర్శులు చేతులు దులుపుకున్నారు. కాగా వెంకటా పురం మండల కేంద్రంలోని,మార్కెట్ సెంటర్ దేవస్థానం ఆవరణలో సుమారు పది రోజుల క్రితం దీపావళి సామాన్లు విక్రయించే దుకాణాలకు ముందు బాణసంచా అగ్ని ప్రమాదా లు జరగకుండా ప్రయివేటు సేవకు జి.పి. వాటర్ ట్యాంకు నీటిని ట్యాంకర్ నిండా తెచ్చి దేవస్థాన ఆవరణలో వదిలిలే శారు. దీపావళి పండగకు రెండు,మూడు రోజుల ముందే సుమారు పది రోజుల క్రితం నుండి జీ.పి వాటర్ ట్యాంకు దిక్కు,మొక్కు లేని విధంగా దేవస్థానం ఆవరణ లో దీపావళి సామాన్లు దుకాణాల స్థలంలో పడి ఉంది. గతంలోనే ట్రాక్టర్ ట్రాలీ చోరీ కీ గురిఅవటంతో పాటు, వాటర్ ట్యాంకర్ కూడా అదే రీతిలో ఇక్కడ వదిలివేయడంతో గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యాన్ని పలువురు విమర్శిస్తున్నారు. బీ.సీ మరిగూడెం పంచాయతీ కార్యదర్శి బదిలీ అయి మూడు నెలలు కు పైగా కావస్తున్న, నేటికీ రెగ్యులర్ జి.పి.కార్యదర్శినీ నియమించలేదు. వెంకటాపురం మేజర్ పంచాయతీ కార్యద ర్శిని ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. గ్రామపంచా యతీకి కేటాయించిన ట్రాక్టర్ ట్రాలీ, వాటర్ ట్యాంకర్లు, పంచా యతీ కార్యాలయం వద్ద ఉండాల్సినవి బజార్లో వదిలి వేయ టంలో అంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పంచా యతీ ఉన్నతాధికారులు, మండల అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని బీ.సీ మరి గూడెం పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిని నియమించాలని, ట్రాక్టర్ ట్రాలీ చోరీ కేసు పై సమగ్ర విచారణ జరిపించి, పోలీస్ శాఖ ద్వారా రికవరీ చేయించాలని, పంచాయతీ ఆస్తులు కాపాడా లని ప్రజలు పత్రికా ముఖంగా జ.పి,జిల్లా ,మండల అదికా రులకు విజ్ఞప్తి చేస్తున్నారు.