జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
– మేళవించిన తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయం
– ఆడి పాడిన విద్యార్ధీనులు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. బుధవారం నుండి దసరా సెలవులు సందర్భంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అను గుణంగా, విద్యార్థినులు అందంగా అలంకరించిన బతుకమ్మ లతో ఆడి,పాడి సంబరాలకు స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా మహిళా టీచర్లు విద్యార్థులకు సహకరించి అందమైన బతుకమ్మలను అలంకరించి, డీ.జే పాటలతో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో పాటల తో పోరెత్తించారు. ఈ సందర్భంగా తొలిసారిగా వెంకటాపురం పాఠశాలలో మంగళవారం బతుకమ్మల పండుగ ఆటలు చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో ముఖ్యంగా మహిళలు రావటంతో పాఠశాల ప్రాంగణం కిటకిటలాడింది. సుమారు 300 మందికి పైగా బాలికలు బతుకమ్మ ఆట పాటలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందంగా అలంక రించిన బతుకమ్మలకు గ్రామ ప్రముఖులు బహుమతులను స్పాన్సర్ చేశారు. వెంకటాపురం పట్టణంలోని కె ఎస్ కె కూరగాయల దుకాణం అధిపతి కలకోట సంతోష్ కుమార్ గుప్తా వంద మందికి పైగా విద్యార్థులకు కన్సోలేషన్ బహుమ తులను అందజేశారు. మహిళా ఉపాధ్యాయులకు కూడా బతుకమ్మ బహుమతులను అందజేశారు. టిఆర్ఎస్ నాయ కుడు గూడవర్తి నరసింహమూర్తి 10 వేల రూ. నగదుతో బహుమతులను అందజేశారు. అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ కూడా బహుమతులను స్పాన్సర్ చేశారు. ఆయా బహుమతులను ఉపాధ్యాయులు బహుమతి గ్రహీతలను పేర్లు ప్రకారం పిలవగా, కేఎస్కే అధిపతి కలకోట సంతోష్ కుమార్, మరియు టిఆర్ఎస్ నాయకులు వేల్పురి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎంపీటీసీ సీతాదేవి గ్రామ ప్రముఖులు, మీడియా మిత్రులు ఉపాధ్యాయులు, విద్యార్థులకు బహుమతులు అం దజేశారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా విద్యా ర్థులు శివాలయం నాగులమ్మ పుట్ట వద్ద కు తీసుకువెళ్లి క్రమ పద్ధతిలో పుట్ట వద్ద అలంకరించి వెళ్లి రావమ్మ బతకమ్మ తల్లి అంటూ విద్యార్థులు నమస్కారాలతో బతుకమ్మ ల ను మేళ తాళాలు తో సాగనంపారు.