రంగాపూర్ లో దోమతెరల వాడకంపై అవగాహన
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి: తాడ్వాయి మండలం రంగాపూర్ గ్రామంలోని గ్రామస్తులకు దోమతెరల వాడకంపై ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ రంగాపూర్ సిబ్బంది ఎం ఎల్ హెచ్ పి సాయి, ఎం పి హెచ్ ఎల్లారేశ్వరి ల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు దోమల లార్వా అభివృద్ధిపై, దోమ కాటుతో సంభవించే వ్యాధులను వివరించారు. నిల్వ ఉన్న నీటి ట్యాంకులు, బావులకు సోడియం క్లోరినేషన్ నిర్వహించి, గ్రామంలో ఇంటింటా జ్వరాల సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది రాజు కుమార్, సత్యం లతోపాటు తదితరులు పాల్గొన్నారు.