Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

యాప్ ద్వారా ఎరువుల బుకింగ్‌ పై అవగాహన

On: December 19, 2025 1:57 PM

యాప్ ద్వారా ఎరువుల బుకింగ్‌ పై అవగాహన

వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 19 (తెలంగాణ జ్యోతి): రైతులు యూరియా ఎరువులను ఇకపై యాప్ ద్వారా సులభంగా పొందవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపురంలో ఏటూర్‌నాగారం ఏడిఎ ఆధ్వర్యంలో, వెంకటాపురం మండల ఎరువుల డీలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో యూరియా పొందేందుకు ప్రత్యేక యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. వెంకటాపురం మండల వ్యవసాయ శాఖ అధికారి నవీన్ మాట్లాడుతూ, డిసెంబర్ 20 (శనివారం) నుంచి రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా తీసుకొచ్చిన ప్రత్యేక యాప్‌లో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. పట్టాదారు పాసుబుక్ ఉన్న రైతులు తమ పాసుబుక్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా యూరియాను బుక్ చేసుకోవచ్చని, కౌలు రైతులకు కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉందని చెప్పారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉండి, మొబైల్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. యూరియా కొనుగోలులో వచ్చిన ఈ మార్పులను రైతులు గమనించి, యాప్ ద్వారా సులభంగా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ సమాచారాన్ని అన్ని రైతులకు చేరవేయాలని డీలర్లను వ్యవసాయ అధికారి కోరారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!