కాపేడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు అవగాహన.
వాజేడు, తెలంగాణ జ్యోతి : మండలంలోని పేరూరు గ్రామంలో కాపేడు స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘం మహిళలకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల పై అవగహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఆర్థిక అక్షరాశ్యత కో ఆర్డినేటర్ మాధురి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వంద రోజుల కార్డు కచ్చితంగా చేయించుకోవాలని లేని వారికి ఇప్పుడు ఎంపీడీవో ఆఫీస్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలియ జేసారు. ఆర్థిక అక్షరాస్యత నిర్మూలన కేంద్రం వాజేడు మండలం, మంగపేట మండలం లో పనిచేస్తున్న కోఆర్డినేటర్ మాధురి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణంతో పాటు 10 లక్షలు ఇన్సూరెన్స్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి సురక్ష బీమా యోజన, లేబర్ ఇన్సూరెన్స్, అటల్ పింఛన్ యోజన గురించి తెలియజేశారు. హన్మకొండ లోని అసంపర్తి మండలంలో స్థానిక ఎస్బిఐ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో టైలరింగ్ ఎంబ్రా యిడరీ 30 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎవరైన ఆసక్తి కలవారు వెళ్ళ వచ్చు అని తెలియచేశారు. ఈ కార్యక్రమానికి వాజేడు మండల కోఆర్డినేటర్ జి కామేష్, ప్రసాద్, భాస్కర్, రమాదేవి, స్వరూప, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.