ఆటో డ్రైవర్లకు ఆర్టిఏ నిబంధనలపై అవగాహన

ఆటో డ్రైవర్లకు ఆర్టిఏ నిబంధనలపై అవగాహన

ఆటో డ్రైవర్లకు ఆర్టిఏ నిబంధనలపై అవగాహన

– నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : ఎస్సై తాజుద్దిన్

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలోని వైజంక్షన్ వద్ద గురువారం ఎస్సై తాజుద్దిన్ వాహన తనిఖీలు చేపట్టి ఆటో డ్రైవర్లకు ఆర్టిఏ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆటో, మ్యాజిక్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను  పాటించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పకుండా యూనిఫామ్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయకూడదన్నారు. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని, నిబం ధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకొని వాహనాలు సీజ్ చేస్తామని ఎస్సై తాజుద్దీన్ డ్రైవర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైతో పాటు పోలీసు, సీఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment