నీటి నాణ్యత పై రైతులకు విద్యార్థులకు అవగాహన సదస్సు

నీటి నాణ్యత పై రైతులకు విద్యార్థులకు అవగాహన సదస్సు

నీటి నాణ్యత పై రైతులకు విద్యార్థులకు అవగాహన సదస్సు

ములుగు ప్రతినిధి, తెలంగాణజ్యోతి: భూగర్భ జల వనరుల శాఖ ములుగు జిల్లా వారి సహకారంతో యువతరం యూత్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో శనివారం ములుగు మండలం లోని జగ్గన్నపేట గ్రామంలో నీటి నాణ్యతపై రైతులకు విద్యార్థు లకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా భూగర్భ జల వనరుల శాఖ అధికారి శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ భూగర్భ జలాలు మానవ మనుగడకు ఎంతో ముఖ్యమని తెలుపుతూ ప్రతి ఒక్కరూ నీటి నాణ్యత గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలన్నారు. నీటి నాణ్యతలో తెలుసుకోవాల్సిన అంశాల గురించి వివరించారు.ఈ సందర్భంగా వారు తెలిపిన అంశాలు: నీరు శుభ్రంగా ఉండటం యొక్క అవసరాన్ని సూచించా రు. నీటి నాణ్యతను ప్రభావితం చేసే మూలకాలు (రసాయనాలు, సూక్ష్మజీవులు,మలినాలు) నీటి నాణ్యత సూచికలు (పీహెచ్, టీడీఎస్, హార్డ్‌నెస్, మెటల్స్ వంటివి) వివరించారు.

నీటి కాలుష్యం కారణాలు ఐన పరిశ్రమల మలినాలు

గృహ మలినాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు. వ్యవసాయ రసాయనాలు పురుగు మందులు మొదలగు వాటి వాడకం ద్వారా భూగర్భ జలాలు కలుషిత మవుతున్నాయని అన్నారు. భూగర్భ జలాలను సంరక్షించడం కొరకు వాటి స్థాయిలను పెంచడం కొరకు ప్రతి ఒక్కరు వారి వారి ఇండ్లలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి గా హాజరైన జిల్లా హైడ్రో జియాలజి కృష్ణ కాంత్ మాట్లాడుతూ ప్రాంతాలను బట్టి ఆయా ప్రాంతా లలో ఉన్న మూలకాలను భూమిలోని మూలకాలను బట్టి నీటి యొక్క సాంద్రత నీరు మారు తూ ఉంటుందని తెలిపారు. నీటిలో అన్ని మూలకాలు సమపాళ్లలో కావలసినటువంటి స్థాయి లలో ఉన్నప్పుడు మాత్రమే ఆ నీరు సాగునీటికి ఉపయోగపడుతుందని అలాంటి భూగర్భ జలాలు మాత్రమే రైతుల యొక్క సాగునీటి సామర్ధ్యాన్ని పెంచుతాయని తెలుపుతూ, రైతులం దరూ భూగర్భ జలాలు కలుషితం అయ్యే కారణమయ్యే పురుగుమందుల వాడకాన్ని తగ్గించా లని భూగర్భ జలాలు సంరక్షించబడితేనే రైతులు పంటలు మంచి స్థాయిలో అందుతాయని రైతుల పంటలు ఎదిగితేనే మానవ మనుగడ సామర్థ్యం పెరుగుతుందని అన్నారు, బాలలం దరూ రోజువారి కార్యక్రమాలలో వాళ్ళ ఇంటిలో మంచినీటి స్థాయిలను ఎలా పరిశీలించాలో పరీక్షలు చేసి చూపించారు.మొబైల్ భూగర్భ జల నీటి పరిశీలన కేంద్రాన్ని గ్రామంలో రైతులకు చూపించడం జరిగింది. గ్రామంలోని వివిధ ప్రాంతాలలోని నీటిని పరీక్ష చేసి ఆ రైతులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు వారి పాఠశాలల్లోనూ త్రాగునీటిని వాటిలో ఉన్న సాంద్రతను తెలిపే పరీక్షలు చేసి అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో యువతరం యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు అరవింద్ నీటి నాణ్యత గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి విద్యార్థులకు రైతులకు అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి జె. ఓంకార్, యువతరం యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు, జగ్గన్నపెట గ్రామ రైతులు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment