సన్ రైజర్స్ స్కూల్ లో మాక్ ఎలక్షన్
– ప్రిన్సిపాల్ పెట్టాం రాజు
ములుగు ప్రతినిధి : జాతీయ ఎన్నికల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సన్ రైజర్స్ హై స్కూల్ లో పాఠశాల కరస్పాం డెంట్ పెట్టం రాజు ఆధ్వర్యంలో శనివారం మాక్ ఎలక్షన్ ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా రవాణా శాఖ అధికారి బి. శ్రీనివాస్ హాజరై ఎన్నికల పోలింగ్ బూత్ రూమ్ లను ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులకు ఓటు విలువ, ఓటు సద్వినియోగంపై అవగాహన కల్పించారు. మాక్ ఎలక్షన్ లో విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకొని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈసం స్వామి మరియు బండారి లావణ్య లను అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్త శ్రావణ్ కుమార్ ఎండి జనరల్ ఫిజీషియన్, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ బలుగూరి జనార్ధన్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం, తోపాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.