విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన అధికారులకు అవార్డులు
– రిపబ్లిక్ డే సందర్భంగా ప్రశంసా పత్రాలు అందజేత.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం తహసిల్దార్ లక్ష్మీ రాజయ్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. రాజేంద్ర ప్రసాద్, వెంకటాపురం మేజర్ పంచాయతీ కార్యదర్శి జి. ప్రవీణ్ లు విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రాలను అందుకున్నారు. పంచాయతి రాజ్ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం అమలు పరుస్తున్న వివిధ సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో సైతం అర్హులైన వారికి అందే విధంగా, నూతన ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ఇతర సంక్షేమ పథకాలు నేరుగా గ్రామాల్లోకి తీసుకవెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్న అధికారులను జిల్లా స్థాయి అధికారులు గుర్తించారు. అదికారులను ప్రోత్సహించేందుకు ఉత్తమ సేవా అవార్డులను జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో హర్ష ద్వానాల మధ్య అందజేశారు. ఉత్తమసేవా అవార్డులు అందుకున్న అధికారులకు వెంకటాపు రం మండలంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు,సిబ్బంది రాజకీయ పార్టీల నేతలు, గిరిజన సంఘాలు, పంచాయతీరాజ్, మండల పరిషత్, జి.పి. కార్యదర్శిల సంఘం, రెవెన్యూ, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.