గోదావరి వంతెన సమీపంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత.
- ఇరువురు అరెస్ట్ కేసు నమోదు
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు జాతీయ రహదారిపై వాజేడు పోలీసులు మంగళవారం సాయంత్రం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా, గోదావరి వంతెన సమీపంలో ద్విచక్రవాహనంపై వస్తున్న ఇరువురు వ్యక్తులను అనుమానంపై తనిఖీలు చేయగా, వాహనంపై రవాణా చేస్తున్న మద్యం బాటిళ్లను వాజేడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాజేడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం... మంగళవారం మధ్యాహ్నం సమయంలో, పూసురు గోదావరి బ్రిడ్జి వద్ద వాహనాల తనికీ లు చేస్తుండగా, అందాజా 3:30 గంటల సమయం లో ఏటూరునాగా రం నుండి మండపాక వైపుకు వస్తున్న గ్లామర్ బైక్ ను ఆపి తనికీ చేయగా అట్టి బండి పై వస్తున్న వారిని పోలీసులు ప్రశ్నించారు. వారు కొప్పుసూరు గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ బాబా, మరియు కొంగాల గ్రామానికి చెందిన పర్శిక్ అజిత్ అను ఇద్దరు వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా,వాళ్ళ గ్రామము లలో అమ్ముటకు మ ద్యం బాటిళ్ళు ను ఏటూరునాగారం నుండి తెస్తున్న మద్యం కోటర్లు వారి వద్ద ఉండగా, అట్టి వ్యక్తుల నుండి మద్యం బాటిళ్లను,స్వాధీనం చేసుకున్నారు. మద్యం విలువ సుమారు 13,860/- రూపాయలు వుంటుందని అంచనా. గ్లామర్ బైక్ ను కూడ పంచనామా ద్వారా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఆయా వ్యక్తులను వాజేడు పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి వారి ఇరువురి పై కేసు నమోదు చేసినట్లు వాజేడు ఎస్.ఐ. వెంక టేశ్వరరావు మంగళవారం సాయంత్రం మీడియా కు తెలిపారు.