అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న గోవులు పట్టివేత
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం జగన్నాధపురం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహనాలు తణీకి చేస్తుం డగా ఆదివారం వేకువజామున బొలెరో వాహనంలో ఎటువం టి అనుమతి పత్రాలు లేని గోవులను తరలిస్తున్న బొలెరో వాహనం పట్టుబడింది. వాజేడు ఎస్సై రుద్ర హరీష్ కదనం ప్రకారం… ఛత్తీస్గడ్ రాష్ట్రం నుండి హైదరాబాద్ కు ఎటువంటి అనుమతి పత్రాలు లేని గోవులను బొలోరో వాహనంలో చీకటి వేళలో తరలిస్తున్నట్టు నమ్మదగిన విశ సమాచారంతో పోలీసులు తమదైన శైలిలో వాహనాలు తనిఖీలు కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ తనిఖీలలో అనుమతి పత్రాలు లేని గోవులు తరలిస్తున్న బొలెరో వాహనం పట్టుబడింది. ఈ సందర్భంగా షేక్ అలీ, షేక్ మియా ఉద్దీన్ అనే ఇరువులు వ్యక్తులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గోవులను, గోవుల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు వాజేడు ఎస్సై రుద్ర హరీష్ మీడియాకు తెలిపారు.