పీఆర్ ఆర్ యూనిటీ, చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన గ్రంధాలయ ఏర్పాటు
– ప్రారంభించిన రాష్ట్ర యువజన కార్యదర్శి ధనసరి సూర్య
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండల కేంద్రంలో మడుగురి పోతరాజు -రాజేశ్వరమ్మ ల జ్ఞాపకార్థంతో పీఆర్ ఆర్ యూనిటి & చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయగా రాష్ట్ర యువజన కార్యదర్శి, సీతక్క తనయుడు ధనసరి సూర్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిం చారు.ఈ సందర్బంగా సూర్య మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధులు, గ్రామ సర్పంచ్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘమైన ప్రయాణం చేసి, రాష్ట్ర, కేంద్ర స్థాయి నాయకులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని, ఏజెన్సీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కి బలమైన పునాదులు వేసి,మారుమూల ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడిన ఆయన సేవలు మరువలేనివని అన్నారు. ప్రజా నాయకుడు క్రీ.శే. మాడుగురి పోతరాజు – రాజేశ్వరమ్మ ల పేరుతో పీఆర్ ఆర్ (మాడుగురి పోత రాజు రాజేశ్వరమ్మ) ల యూనిటీ అండ్ చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన ట్రస్ట్ గ్రంధాలయాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నా రు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు చిటమట రఘు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఎండి ఖలీల్ ఖాన్, మాడుగురి ప్రసాద్, ముక్కెర లాలయ్య, ఎండీ వలియాబీ సలీం, మండల ఉపాధ్యక్షులు ఈసం నర్సయ్య, యూత్ ఉపాధ్యక్షులు సర్వ అక్షిత్, సర్వ సాయి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గద్దల నవీన్, బండారి లక్కీ, ఎండీ పరుక్, ముస్తఫా, ఎండీ అలీ, వలస తిరుపతి, వెలగందుల మాధవ్, బ్లాక్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు వసంత శ్రీనివాస్, సద్దాం, రమేష్ తదిత రులు పాల్గొన్నారు.